Vanam Movie Review and Rating | హిట్టా ఫట్టా :-


Movie :- Vanam (2021) Review
నటీనటులు : – వెట్రి, అను సితార, స్మ్రుతి వెంకట్ మొదలగు
నిర్మాతలు:- గ్రేస్ జయంతి రాణి, JP అమలన్, JP అలెక్స్
సంగీత దర్శకుడు:- రాన్ ఏతాన్ యోహాన్
దర్శకుడు:- శ్రీకంఠన్ ఆనంద్
Story :-
ఈ సినిమా పునర్జన్మ అనే కాన్సెప్ట్ చుట్టూ తిరుగుతుంది. ఖాళీగా ఉన్న మెన్స్ హాస్టల్‌లో పని చేయడానికి వచ్చిన ఒక మనిషి మరణంతో సినిమా మొదలవుతుంది. వెంటనే సీన్ ఆర్ట్ కాలేజీ విద్యార్థి అయిన మగిజ్ (వెట్రి) ఇంట్రడక్షన్ జరుగుతుంది. అతడి చిన్ననాటి లవర్ అయిన జాస్మిన్ (స్మ్రుతి) ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్.
మాగిజ్ తన స్నేహితుడు మరియు వర్క్ చేయడానికి వచ్చిన మనిషి మరణించిన అదే గదిలో చేరినప్పుడు కొత్త కొత్త పరిణామాలని ఎదురుకుంటాడు. ఇప్పుడు మగిజ్ మరియు జాస్మిన్ ఆ రూం లోని మిస్టరీ నీ సాల్వ్ చేసే పనిలో పడుతారు.
ఇంతకీ ఆ గదిలో ఏముంది? కార్మికుడు మరియు మాగిజ్ రూమ్మేట్ ఎలా చనిపోయారు? మగిజ్ మరియు జాస్మిన్ మిస్టరీని ఎలా చేదిస్తారు? ఆ గది కి ఏమైనా ఫ్లాష్ బ్యాక్ ఉందా ? ఉంటే ఎంటది ? చివరికి ఎం జరిగింది అనేది మిగిలిన కథ.
Thumps Up :-
- నటీనటుల పెర్ఫార్మెన్స్
- స్క్రీన్ ప్లే.
- సినిమాటోగ్రఫీ
- ప్రొడక్షన్ వాల్యూస్
Thumps Down :-
- రొటీన్ స్టోరీ మరియు ఫ్లాష్ బ్యాక్.
- లాజిక్స్.
Final Verdict :-
వనం అనే సినిమా మిమ్మల్ని ఎక్కువ శాతం అలరించే ఒక అద్భుతమైన చిత్రం. నటీనటులు తమ బెస్ట్ పెర్ఫార్మెన్స్ అందించారు. దర్శకుడు స్క్రీన్‌ప్లే వర్క్‌ని బాగా చేసాడు.
ప్రొడక్షన్ వాల్యూస్, సినిమాటోగ్రఫీ చాలా బాగున్నాయి మరియు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్లస్ అయ్యింది. కానీ రెగ్యులర్ ఫ్లాష్‌బ్యాక్ ఫార్మాట్‌లో ఉండటంతో రొటీన్ కథగా ముగుస్తుంది. మొత్తంమీద ఒక్కసారి చూడదగిన సినిమా.
Rating :- 2.75/5