The Matrix Resurrections Movie Review and Rating |హిట్టా ఫట్టా :-


Movie :- The Matrix Resurrections
నటీనటులు :- కీను రీవ్స్, క్యారీ-అన్నే మోస్, యాహ్యా అబ్దుల్-మతీన్ II, జెస్సికా హెన్విక్, జోనాథన్ గ్రోఫ్,
నీల్ పాట్రిక్ హారిస్, ప్రియాంక చోప్రా జోనాస్, జాడా పింకెట్ స్మిత్ తదితరులు
నిర్మాత:- జేమ్స్ టీగ్,
లానా వాచోవ్స్కీ, గ్రాంట్ హిల్
సంగీత దర్శకుడు:- జానీ క్లిమెక్, టామ్ టైక్వెర్
దర్శకుడు:- లానా వాచోవ్స్కీ
Story :-
ఈ కథ థామస్ ఆండర్సన్ (కీను రీవ్స్) పాత్ర చుట్టూ తిరుగుతుంది, అతని గత పేరు నియో. అతను ఇప్పుడు వీడియో గేమ్ డిజైనర్. అతను గేమ్ ఎపిసోడ్స్ డిజైన్ చేసే పనిలో ఉన్నపుడు అకస్మాత్తుగా అతని పేరు నియో అని అతనికి గతం ఏదో ఉందనే ఆలోచనలు వస్తుంటాయి.
నియో యొక్క ప్రేమ జీవితం ట్రినిటీ (క్యారీ-అన్నే మోస్) అలియాస్ టిఫనీ అనే అమ్మాయితో ముడిపడి ఉంటుంది. థామస్ కొన్ని మానసిక సమస్యలను ఎదుర్కొన్నందున, అతను బ్లూ పిల్స్ సమయానుసారంగా వేసుకోవాలని థెరపిస్ట్ ది అనలిస్ట్ (నీల్ పాట్రిక్ హారిస్) ఆజ్ఞాపిస్తాడు, అయితే మార్ఫియస్ (యాహ్యా అబ్దుల్-మతీన్ II) మరియు బగ్స్ (జెస్సికా హెన్విక్) బ్లూ పిల్స్ బదులుగా రెడ్ పిల్స్ వేసుకోమని అదేశమివగ్గా పరిస్థితులు మరింత దారుణంగా మారిపోతాయి.
థామస్ జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి? అతని ప్రేమ జీవితం ఏమైంది? అతని కొత్త శత్రువులు ఎవరు? అతను రెడ్ పిల్ తీసుకున్నప్పుడు ఏమి జరిగింది? చివర్లో ఏం జరిగిందనేది మిగిలిన కథ.
Thumps Up :-
- ప్రధాన నటీనటులందరూ ఈ రకమైన కాన్సెప్ట్ ఫిల్మ్‌ని ఎంగేజ్ చేయడంలో తమ రేంజ్ నటనతో అలరించారు.
- దర్శకుడు లానా వాచోవ్స్కీ మరోసారి మ్యాట్రిక్స్ ఫ్రాంచైస్ అందించడంలో తనదైన మార్క్ ఇచ్చారు.
- సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి.
- యాక్షన్ సీక్వెన్సులు మరియు దాని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్.
Thumps Down :-
- స్లో నేరేషన్.
- ఒక్కోసారి కన్ఫ్యూజన్ గా ఉంటుంది.
Final Verdict :-
మ్యాట్రిక్స్ ఫ్రాంచైజ్‌పై నాల్గవ భాగంగా లారా వాచోవ్స్కీ చేసిన సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తుంది. నటీనటులు అందరూ చాలా బాగా పాత్రలో నిమగ్నం అయ్యి చేశారు.
ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి మరియు సినిమాటోగ్రఫీ విజువల్స్ చాలా బాగున్నాయి. కాస్త స్లో గా మరియు కాన్ఫ్యూజ్ గా ఉన్నప్పటికీ నటీనటుల పర్ఫార్మెన్స్ వళ్ళ అవి కనిపించవు.
Rating : 3/5