The Book of Boba Fett Movie Review and Rating | హిట్టా ఫట్టా :-


Movie :- The Book of Boba Fett (2021)
నటీనటులు :- టెమ్యురా మోరిసన్, మింగ్-నా వెన్ మొదలగు
నిర్మాత:- జోన్ ఫావ్రూ, డేవ్ ఫిలోని, రాబర్ట్ రోడ్రిగ్జ్, కాథ్లీన్ కెన్నెడీ
సంగీత దర్శకుడు:- లుడ్విగ్ గోరాన్సన్
దర్శకుడు:- రాబర్ట్ రోడ్రిగ్జ్
Story :-
చాప్టర్ 1:- Stranger in a Strange Land :-
ఈ ఎపిసోడ్ పూర్తిగా బోబా మరియు టుస్కెన్స్ మధ్య ఉన్న సంబంధం గురించి చెప్తుంది. ఈ ఎపిసోడ్ బోబా యొక్క కవచాన్ని టుస్కెన్ రైడర్స్ తీసుకెళ్ళి ఒక్క చోట బంధించడం తో మొదలవుతుంది. తర్వాత సీన్ ప్రస్తుత సమయానికి మారగ ఫెన్నెక్ షాండ్ బోబాను అండర్ వరల్డ్ డాన్‌గా చేస్తాడు.
బోబా దానిని అంగీకరించినప్పటికీ అతను ఫెన్నెక్ ఇచ్చే ఆదేశాలను తిరస్కరించినప్పుడు అసలైన కథ మొదలవుతుంది. ఈ సంభాషణలో తోటి సభ్యులకి కూడా కరెక్ట్ అనిపించదు. ఇపుడు బోబా కి ఎన్నడూ లేని సమస్యలు ఎదురవబోతున్నాయి.
ఇప్పుడు, బొబా ఏం చేస్తాడు? టస్కెన్ రైడర్స్ బోబా యొక్క కవచాన్ని ఎలా తీసుకుంటారు? బోబా మరియు టస్కెన్ మధ్య సంబంధం ఎలా ఉంది అనేది ఎపిసోడ్ 1 యొక్క కథాంశం.
Review :- మొదటి ఎపిసోడ్ ఈ సీరీస్ అభిమానులను మరియు ఫ్రాంచైజీ ప్రేమికులందరినీ ఓ రేంజ్ లో అలరిస్తుంది అనే విషయంలో ఎటువంటి సందేహం లేదు. ప్రతి ఒక్కరూ తమ తమ పాత్ర పరిధిలో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు మరియు రాబోయే ఎపిసోడ్‌ల కోసం కావల్సినంత హైప్‌ని సృష్టించారు.