Spencer Movie Review and Rating |హిట్టా ఫట్టా :-


Movie : Spencer (2021) Review
నటీనటులు :- క్రిస్టెన్ స్టీవర్ట్, తిమోతీ స్పాల్, జాక్ ఫార్థింగ్, సీన్ హారిస్, సాలీ హాకిన్స్ మొదలగు
నిర్మాత: – జువాన్ డి డియోస్ లారైన్, జోనాస్ డోర్న్‌బాచ్, పాల్ వెబ్‌స్టర్, పాబ్లో లారైన్, జానైన్ జాకోవ్స్కీ, మారెన్ అడే
సంగీత దర్శకుడు:- జానీ గ్రీన్‌వుడ్
దర్శకుడు :- పాబ్లో లారైన్
Story :
ఈ చిత్రం 1991 సంవత్సరంలో జరిగే క్రిస్మస్ పండుగ చుట్టూ తిరుగుతుంది , ఇక్కడ బ్రిటిష్ రాజ కుటుంబం పాలస్ లో కుటుంబం అంత కలిసి గడపాలని ప్లాన్ చేశారు. వేల్స్ యువరాణి అయిన డయానా ఇక్కడకు వచ్చింది, ప్రిన్స్ చార్లెస్‌కి మరొక మహిళతో సంబంధం ఏర్పడిన కారణంగా డయానా తో చార్లెస్ కి జరగాల్సిన వివాహం ఆగిపోయింది . ఈలోపు డయానా ఎస్టేట్ చుట్టూ తిరుగుతూ తన జ్ఞాపకాలను నెమరువేసుకుంది.
చివరగా, ఆమె ఎస్టేట్‌లోకి ప్రవేశించింది మరియు కొద్దిసేపటికే ఆమె అన్నే బోలీన్‌పై ఒక పుస్తకాన్ని చూసింది మరియు దానిని చదవడం ప్రారంభించింది. ఇప్పుడు, డయానా యొక్క హ్యల్యుసినేషన్ జీవితం ప్రారంభమవుతుంది, అక్కడ ఆమె చార్లెస్ గిఫ్ట్, క్రిస్మస్ సందర్భంగా జరిగిన అదృష్ట సంఘటనలు మరియు ఘోస్ట్ ఆఫ్ బోలీన్ గురించి చాలా ఊహించుకుంది.
డయానాకు ఏమి జరిగింది, ఆమె ఎందుకు ఇలా ఏవేవో ఊహిచుకుంటుంది. అసలు జరిగిన సంఘటన ఏమిటి? అన్నే బోలిన్ బుక్ అంటే ఏమిటి? ప్రిన్సెస్ చార్లెస్ ఎం చేశాడు? క్రిస్మస్ ఈవ్‌లో డయానా ఎదుర్కొన్న సంఘటనలు ఏమిటి? చివర్లో ఏం జరిగిందనేది మిగిలిన కథ.
Thumps Up :-
- ఈ కన్ఫ్యూసింగ్ కథలో నటీనటులందరూ తమ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు.
- దర్శకుడు పాబ్లో లారైన్ విజన్ బాగుంది, ఎందుకంటే సినిమా ప్రారంభం నుండి చివరి వరకు అనవసరమైన సన్నివేశం లేకుండా చేశారు.
- బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు తగ్గట్టుగా ఉంది.
- సినిమాటోగ్రఫీ, విజువల్స్, వీఎఫ్‌ఎక్స్ వర్క్ స్క్రీన్‌పై ఆకట్టుకున్నాయి.
- ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
Thumps Down :-
- కొన్ని సన్నివేశాలకు లాజిక్స్ ఉండవు
Final Verdict :-
క్రిస్టెన్ స్టీవర్ట్ స్పెన్సర్ చిత్రం విభిన్నమైన మరియు ప్రత్యేకమైన కధతో ఉంటుంది. ఇది అన్ని వర్గాల ప్రేక్షకులను ముఖ్యంగా సినీ ప్రేమికులను అలరిస్తుంది. సినిమాలో అందరూ బాగా చేసారు మరియు డైరెక్టర్ విజన్ చాలా బాగుంది.
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కరెక్ట్ గా ఉంది మరియు సినిమాటోగ్రఫీ విజువల్స్ లావిష్‌గా ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఈ సినిమా తప్పకుండా మీ అందరినీ అలరిస్తుంది.
Rating :- 3/5