Telugu News

గురకతో వచ్చే ప్రమాదాలు, solution for snoring problem

గురక ఉంటే నిద్ర ఎక్కడిది ? solution for snoring problem ఆరోగ్యవంతులు నిద్రపోయిన తరువాత గాఢనిద్రలోకి వెళతారు . ఉదయంలోపు నాలుగైదు సార్లు మెలకువ వచ్చినా మళ్లీ వెంటనే నిద్రలోకి వెళ్లిపోతారు . ఇలాంటి వారికి ఏ సమస్యా ఉండదు . కానీ గురకతో బాధపడేవారు పట్టుమని పదినిమిషాలు గాఢనిద్రలో ఉండలేరు . ఎప్పుడూ నిద్రాభంగం కలుగుతూనే ఉంటుంది .

కారణాలు : ముక్కులో మాంసం పెరగడం లేదా ముక్కుదూలం వంకరగా ఉండటం వల్ల ముక్కులో నుంచి స్వేచ్ఛగా గాలి పీల్చుకోలేకపోతారు . టాన్సిల్స్ వాయడం వల్ల ఆ ప్రదేశం ఇరుకుగా మారడం , నాలుక వెనకాల భాగం ఇరుకు కావడం వల్ల నోటిలో నుంచి గాలి సాఫీగా వెళ్లదు . కొందరిలో పుట్టుకతోనే ఊపిరి పీల్చుకునే ప్రదేశం చిన్నగా ఉంటుంది . వీరిని సిండ్రోమిక్ చిల్డ్రన్ అంటారు . పిల్లల్లో , యువతుల్లో టాన్సిల్స్ , అడినాయిడ్స్ పెరగడం వల్ల గురక వస్తుంది . పాలెట్ వల్ల కూడా గురక సమస్య మొదలవుతుంది . ఏం జరుగుతుంది ? : నిద్ర సరిగ్గా ఉండదు . ఉదయం వేళ చురుగ్గా ఉండరు . రాత్రివేళ నిద్ర సరిగ్గా లేకపోవడంతో వాహనాలు నడిపే సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది . రాత్రివేళ గాలి తీసుకోవడానికి ఇబ్బంది పడతారు . ఫలితంగా బిపి పెరిగిపోతుంది . పని సరిగ్గా చేయలేకపోతారు .

solution for snoring problem ::

పిల్లలు చదువులో వెనకబడతారు . జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది . ఏకాగ్రత తగ్గిపోతుంది . మెదడుకు ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతుంది . గుండె జబ్బులు వచ్చే అవకాశం పెరుగుతుంది . గుండె జబ్బులతో బాధపడుతూ కార్డియాలజిస్టు సంప్రదించే వారిలో 30 శాతం మందిలో గురక ఉంటుంది . నిద్ర సరిగ్గా లేకపోవడం మూలంగా చికాకు , విసుగు పుట్టుకొస్తుంటుంది . హోమియో చికిత్స : గురక సమస్యను తొలగించడానికి హోమియో చికిత్స అద్భుతంగా పనిచేస్తుంది . ఆరోగ్యవంతమైన నిద్ర పోవడానికి అవకాశం లభిస్తుంది . ఎటువంటి సర్జరీ అవసరం లేకుండానే సమస్య శాశ్వతంగా తగ్గిపోతుంది . నిద్రలేమితో బాధపడే వారు అనుభవజ్ఞులైన మంచి అనుభవజ్ఞులైన వైద్యుని ఆద్వర్యం లో చికిత్స తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది .

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
Close
Close