సింగరేణిలో భారీ కుట్ర? Singareni privatisation issue

దేశంలో బొగ్గు పరిశ్రమలను ప్రైవేటు పరం చేసేందుకు Singareni privatisation issue ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కుట్రలు చేస్తున్నారని ప్రతి పక్షాలను విచారించకుండా దేశంలో కార్మిక చట్టాలను మార్చారని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి గౌరవ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు . గురువారం జయ శంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఎఐటియుసి శతజ యంతి ఉత్సవాలలో భాగంగా మంజూరు నగర్ సమీ పంలోని ఏరియా ఆస్పత్రి వద్ద ఏర్పాటు చేసిన ఎఐటియుసి పైలాన్ ను ఎఐటియుసి జనరల్ సెక్రెటరీ వాసిరెడ్డి సీతారామయ్య తో కలిసి కూనంనేని సాంబశివ రావు ఆవిష్కరించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను ఆవలంభిస్తోందని అన్నారు . దేశంలో కార్మి కుల హక్కుల పరిరక్షణ కోసం ఆవిర్భవించిన ఎఐటియుసి జన్మించి ఈ సంవత్సరంతో వంద సంవత్స రాలు పూర్తి చేసుకుంటుందన్నారు . అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణి కాలరీస్ సంస్థ లో 1942 సంవత్సరంలో ఆవిర్భవించిన సింగరేణి కాల రీస్ వర్కర్స్ యూనియన్ అనునిత్యం కార్మికుల హక్కుల కోసం పోరాటం చేయడం జరిగిందన్నారు . అంతేకా కుండా సింగరేణిలో కార్మికులకు సంబంధించిన వేతన సవరణ చట్టం బోర్డులను సాధించడం జరిగిందన్నారు .
సింగరేణి సంస్థ ఒకప్పుడు నష్టాల ఊబిలో కూరుకు పోయి మూసివేత దశకు చేరుకోగా ఎఐటియుసి కార్మిక సంఘం ముందువరుసలో నిలిచే కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడుతో మాట్లాడి పన్నెండు వందల తొంభై కోట్ల మారిటోరియం విధించేందుకు కృషి చేయడం జరి గిందని , అప్పటినుండే సింగరేణి పర్యవేక్షణకు కార్మిక సంఘం ముందుండి పోరాటం చేయడం జరిగింద న్నారు . ఇప్పటికి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సింగ రేణిని ప్రైవేటుపరం చేయాలని కుట్ర పన్నుతున్నాయని ఈ మేరకు సింగరేణిలో యాంత్రీకరణ ప్రైవేటీకరణ కొన సాగుతుందని ఏఐటీయూసీ పోరాట ఫలితంగానే ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి మనం కాపాడుకో గలిగ మని సాంబశివరావు అన్నారు .
Singareni privatisation issue ::
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వ రంగ సంస్థలైన సింగరేణి , బ్యాంకు రంగాలు , ఎఐసి , రైల్వేలను ప్రైవేటు పరం చేయాలని ఆలోచనలో పడ్డారని అలాంటి విధానాలను సిపిఐ ఎఐటియుసి ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు తిప్పి కొట్టడం జరుగుతుందన్నారు . రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సింగరేణి సంస్థను ప్రైవేట్ పరం చేయాలనే ఆలోచన తోనే ఓపెన్ కాస్తూ గనుల తవ్వకాలకు శ్రీకారం చుట్టా రని టిఆర్ఎస్ అధికారంలోకి రాకముందు సింగరేణిలో ఒపెన్ కాస్టు గనుల తవ్వకాలు చేపట్టబోమని భూగర్భ గనుల తవ్వకాలు మాత్రమే చేపట్టి నిరుద్యోగ సమస్య తీరుస్తామని చెప్పి ఇప్పుడు కేసీఆర్ కూడా ప్రైవేటీకరణ దిశవైపు అడుగులు వేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ విధా నాల ను ఎప్పటికప్పుడు సిపిఐ ఎఐటియుసి ఎండగడు తుందన్నారు . ఇప్పటికీ సింగరేణి సంస్థను కాపాడుకు నేందుకు సేవ్ సింగరేణి నినాదాలతో 20 రోజులపాటు సిపిఐ ఆధ్వర్యంలో కోల్‌బెల్ట్ ప్రాంతంలో ప్రచార జాత నిర్వహిస్తామని సాంబశివరావు అన్నారు .
ఈ కార్యక్ర మంలో ఏ ఐటి యు సి రాష్ట్ర జనరల్ సెక్రెటరీ వాసిరెడ్డి సీతారామయ్య , అధ్యక్షులు వై గట్టయ్య , భూపాలపల్లి బ్రాంచ్ కార్యదర్శి మోట పలుకుల రమేష్ , కేంద్ర కమిటీ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ కొరిమి రాజ్ కుమార్ , నాయ కులు విజేందర్ , నూకల చంద్రమౌళి , మహిళా నాయకు రాలు సుగుణ , యూనియన్ జనరల్ సెక్రెటరీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ లు శ్రీ బాజీ సైదా , శ్రీ కొరిమి రాజ్ కుమార్ , శ్రీరాంపూర్ ఏరియా బ్రాంచ్ కార్యదర్శి శ్రీ కిషన్ రావు , భూపాలపల్లి బ్రాంచ్ కార్యదర్శి రమేష్ , భూపాలపల్లి బ్రాంచ్ కమిటీ అసిస్టెంట్ సెక్రటరీలు శ్రీని వాస్ , విజేందర్ తదితరులు పాల్గొన్నారు .