Minnal Murali (2021) Movie Review and Rating | హిట్టా ఫట్టా :-


Movie : Minnal Murali (2021) Review
నటీనటులు :- టోవినో థామస్, ఫెమినా జార్జ్, గురు సోమసుందరం మొదలగు
నిర్మాత:- సోఫియా పాల్
సంగీత దర్శకుడు:- సుశిన్ శ్యామ్
దర్శకుడు :- బాసిల్ జోసెఫ్
Story :-
ఈ కథ మెరుపు ప్రభావంతో జైసన్ (టొవినో థామస్) సంపాదించిన సూపర్ పవర్స్ గురించి చుపియడం తో మొదలవుతుంది. తనకు వచ్చిన శక్తులని ప్రయోగిస్తూ లైఫ్ హ్యాపీ గా లీడ్ చేస్తుంటాడు. కానీ తనకు శక్తులు వచ్చిన రోజే అదే మెరుపు ప్రభావం వల్ల మరొక వ్యక్తి కి కూడా అలాంటి శక్తులే వచ్చాయని తెలుసుకున్నాక ఎం జరిగింది అనేది కథ .
జైసన్ జీవిత కథ ఏమిటి? అతని ప్రత్యేకత ఏమిటి? అతనికి ప్రత్యేక శక్తులు ఎందుకు వచ్చాయి? అదే శక్తులు పొందిన మరో వ్యక్తి ఎవరు? ఇద్దరి మధ్య సమస్యలు ఎలా వచ్చాయి? గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? జైసన్ తన శక్తులతో ఏం చేశాడు? చివర్లో ఏం జరిగిందనేది మిగిలిన కథ.
Thumps Up :-
- కథ బాగుంది.
- సినిమా మొత్తంలో టోవినో థామస్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు.
- వీఎఫ్‌ఎక్స్, సినిమాటోగ్రఫీ వర్క్ బాగున్నాయి.
- కామెడీ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి.
- ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
Thumps Down :-
- సినిమాలో అనవసరపు సన్నివేశాలు ఎక్కువ ఉన్నాయి.
- మొదటి భాగం స్లో గా ఉంటుంది.
- దర్శకుడు అనవసరంగా సబ్‌ప్లాట్స్ పెట్టడంతో మెయిన్ కథ మరిచిపోయేలా చేస్తారు.
Final Verdict :-
ప్రేక్షకులు టోవినో థామస్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం మిన్నల్ మురళి. కానీ ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకోవడంలో విఫలం అయ్యింది. సినిమా మొత్తంలో టోవినో థామస్ తన బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. మిగిలిన వారు పరిమిత సమయంలో తమ బెస్ట్ ఇచ్చారు.
ప్రొడక్షన్ వాల్యూస్, వీఎఫ్‌ఎక్స్ వర్క్స్, సినిమాటోగ్రఫీ సినిమాని చాలా బాగా ఉన్నాయి. ఒకట్టే నెగటివ్ ఏమిటంటే ప్రేక్షకులను అస్సలు ఎంగేజ్ చేయని స్క్రీన్ ప్లే, అంతా గ్రిప్పింగ్ గా లేదు. దర్శకుడు పేపర్ లో ఉన్నా కథని సారిగా తెరకెక్కించలేకపోయారు.
Rating :- 2.5/5