Guduputani Movie Review and Rating | హిట్టా ఫట్టా :-


Movie : Guduputani (2021) Review
నటీనటులు : సప్తగిరి, నేహా సోలంకి, రఘు కుంచె మొదలగు
నిర్మాతలు : పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్
సంగీత దర్శకుడు : ప్రతాప్ విద్యాసాగర్
దర్శకుడు : కుమార్ KM
Story :
ఈ కథ గాఢమైన ప్రేమలో ఉన్న గిరి (సప్తగిరి) మరియు సిరి (నేహా సోలంకి) నీ చూపిస్తూ మొదలవుతుంది. వేరే దారి ఈ ప్రేమ జంట పారిపోయి పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటారు. అందుకే పురాతనమైన అమ్మవారి ఆలయంలో పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. అనుకున్న ప్రకారం గుడికి వెళ్తారు కానీ పూజారి పెళ్ళి అనేది మంచి రోజున చెయ్యాలి ఎపుడు పడితే అప్పుడు కాదు..కొన్ని రోజులు ఆగండి అని చెప్పకనే చెప్తారు. కాబట్టి వేరే మార్గం లేక వారిద్దరూ ఆలోచనలో నిమగ్నం అయ్యి ఉండగా గుడి మూసేస్తారు. దురదృష్టవశాత్తు వారు ఆలయంలోనే ఉండిపోతారు.
ఇదిలా ఉండగా వివిధ దేవాలయాల్లోని పురాతన దేవతల యొక్క ఆభరణాలు దొంగతనం జరుగుతూ ఉంటాయి.
అస్సలు దొంగ ఎవరు? గిరి, సిరిల ప్రేమకథ ఏమిటి? గిరి మరియు సిరి కి పూజారి ఏమని చెప్పాడు ? ఇది మంచి ఉద్దేశమా లేదా ఇంకేదైనా ప్లాన్ తో పూజారి చెప్పాడా ? దేవాలయాల్లో దోపిడీలు ఎలా జరిగాయి? గిరి మరియు సిరి ఈ మిస్టరీని ఎలా ఛేదించారు అనేది మిగిలిన కథ.
Thumps Up :-
- సప్తగిరి అద్భుతమైన నటన.
- కథ
- సెకండాఫ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.
- కామెడీ ట్రాక్.
- నిర్మాణ విలువలు, సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి.
Thumps Down :-
- విలన్ స్టోరీ.
- మొదటి భాగము.
- స్క్రీన్‌ప్లే గ్రిప్పింగ్‌గా లేదు.
Final Verdict :-
సప్తగిరి గుడుపూటని చిత్రం మంచి కథ మరియు సప్తగిరి యొక్క బెస్ట్ నటనతో నిండిన ఒక అద్భుతమైన చిత్రం. కామెడీ ట్రాక్ కూడా బాగుంది. సెకండాఫ్‌లో మంచి ట్విస్ట్‌లు ఉంటాయి, ఇవి ప్రేక్షకులను కట్టిపడేస్తాయి.
నిర్మాణ విలువలు, విజువల్స్ బాగున్నాయి. కానీ ఈ చిత్రానికి విలన్ క్యారెక్టరైజేషన్స్ మరియు రొటీన్ ఫస్ట్ హాఫ్ వంటి నెగటివ్స్ కూడా ఉన్నాయి. ఈ నెగటివ్స్ పక్కన పెట్టేస్తే సప్తగిరి గూడుపుటాని సినిమా ఎంగేజింగ్ థ్రిల్లర్ గా ముగుస్తుంది.
Rating :- 2.5/5