Encanto Movie Review and Rating | హిట్టా ఫట్టా :-


Movie : Encanto (2021) Review
నటీనటులు :- స్టెఫానీ బీట్రిజ్ , మరియా సిసిలియా బొటెరో, జాన్ లెగుయిజామో, మౌరో కాస్టిల్లో, జెస్సికా డారో, ఎంజీ సెపెడా, కరోలినా గైటన్, డయాన్ గెరెరో, విల్మర్ వాల్డెర్రామా మొదలగు
నిర్మాత:- వైవెట్ మెరినో, క్లార్క్ స్పెన్సర్
సంగీత దర్శకుడు:- జర్మైన్ ఫ్రాంకో
దర్శకుడు:- జారెడ్ బుష్, బైరాన్ హోవార్డ్
Story :
ఎన్కాంటో సినిమా కథ ఒక్క కుటుంబం వారి జీవితంలో విషాదకరమైన పరిస్థితిని ఎదుర్కొన్న తర్వాత ప్రత్యేక శక్తులను పొందిన సందర్భం తో మొదలవుతుంది. కుటుంబంలోని ప్రతి ఒక్కరికి ఒకొక్క రకమైన మాయ శక్తులు మరియు ఒక మాయా ఇంటి లో ఉండేలా బహుమతి పొందారు . కానీ మిరాబెల్ కోసం, ప్రత్యేకమైన బహుమతి ఏదీ ఇవ్వబడలేదు, ఇది ఆమె జీవితంలోని ప్రతి సందర్భంలోనూ చిన్నతనం లా అనిపిస్తుంది. కానీ అనుకోకుండా ఆ మాయ శక్తుల ఇల్లు కూలిపోవడం తో కుటుంబంలోని అందరికి భయాందోళన మొదలవుతుంది.
ఇప్పుడు, మిరాబెల్ ఏమి చేయగలదు? ఈ కుటుంబం యొక్క గత తరాలు ఏమిటి? వారికి ఇన్ని మాయ శక్తులు ఎలా వచ్చాయి? వారు ఎదుర్కొన్న విషాద పరిస్థితి ఏమిటి? మిరాబెల్ ఎలాంటి ప్రత్యేక శక్తులని ఎందుకు పొందలేదు? దాని వెనుక ఏదైనా కారణం ఉందా? వీటన్నింటికీ జవాబులు ఏమిటో తెలుసుకోవాలంటే డిస్నీ హాట్‌స్టార్‌లో ఈ చిత్రాన్ని చూడండి.
Thumps Up :-
- ఈ చిత్రాన్ని వినోదాత్మకంగా తెరకెక్కించడంలో నటీనటులందరూ తమ శాయశక్తులా ప్రయత్నించారు.
- దర్శకులు జారెడ్ బుష్ మరియు బైరాన్ హోవార్డ్ విజన్ బాగుంది, ఎందుకంటే సినిమా ప్రారంభం నుండి చివరి వరకు అనవసరమైన సన్నివేశం ఒక్కటి కూడా లేకుండా చేశారు.
- బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు తగ్గట్టుగా ఉంది.
- సినిమాటోగ్రఫీ, విజువల్స్, వీఎఫ్‌ఎక్స్ వర్క్ స్క్రీన్‌పై ఆకట్టుకున్నాయి.
- ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
Thumps Down :-
- కొన్ని లాజిక్స్ లేని సన్నివేశాలు.
Final Verdict :-
ఎన్‌కాంటో అనేది చాలా మంచి కథాంశం మరియు పాత్రల చుట్టూ చక్కటి హాస్యంతో చిత్రీకరించిన అనుభూతిని కలిగించే సినిమా. సినిమాలో ఎలాంటి లోపాలు లేకుండా తీయడం తో దర్శకులు విజయం సాధించారు.
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది మరియు సినిమాటోగ్రఫీ విజువల్స్ లావిష్‌గా ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. లాజిక్స్ వేతకకుండా చూస్తే మీకు సినిమా తప్పకుండా అలరిస్తుంది.
Rating :- 3/5