Decoupled Webseries Review :-


Movie :- Decoupled (2021) Review
నటీనటులు :- మాధవన్, సుర్వీన్ చావ్లా అతుల్ కుమార్
నిర్మాతలు :- జాస్మిన్ మల్హోత్రా, గౌరవ శుక్ల, భవేష్ మండిలియ, విక్రమాదిత్య మొట్వని, సేజల్ షాహ్
దర్శకుడు :- హర్డిక్ మెహత
Story :
ఈ కథ ఒక ప్రముఖ రచయిత ఆర్య అయ్యర్ (R మాధవన్) మరియు ఫైనాన్స్ మేనేజర్ అయిన శ్రుతి శర్మ అయ్యర్ (సుర్వీన్ చావ్లా) పాత్ర చుట్టూ తిరుగుతుంది. వారిద్దరూ చాలా కాలం క్రిందటి నుంచే దంపతులు, కొన్ని అనుకోని కారణాల వల్ల విడాకులు తీసుకోవాలని అనుకున్నారు. కానీ విడాకులు తెసుకోవాలని అనుకున్నప్పటికీ తమ కూతురైన రోహిణి కోసం తల్లిదండ్రులుగా కలిసి జీవిస్తున్నారు. వారి డీ కప్లింగ్ గురించి అందరికీ తెలియజేయడానికి, వారు గోవాలో పార్టీని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు.
ఇప్పుడు, ఈ జంట విడిపోవడానికి గల కారణాలు ఏమిటి? ఆర్య, శృతి శర్మల రిలేషన్ గతంలో మరియు ఇప్పుడు ఎలా ఉంది? ఈ వెబ్ సిరీస్ చివరిలో వారు మళ్లీ కలిశారా లేదా?
Thumps Up :-
- ఎప్పటిలాగే మాధవన్ ఆర్య పాత్రలో జీవించి ఆ పాత్రను చాలా చక్కగా తెరకెక్కించారు. సుర్వీన్ చావ్లా కూడా అత్యుత్తమ ప్రదర్శన చేసింది. మిగిలిన పాత్రలు వారివారి స్క్రీన్ స్పేస్‌కు పరిమితం చేయబడ్డాయి.
- దర్శకుడు బాగా చేసాడు
- సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి.
- బ్యాక్‌గ్రౌండ్ స్కోర్.
Thumps Down :-
- స్లో నేరేషన్.
- మాధవన్ మరియు సుర్విన్ ప్రేమ జీవితాన్ని చూపించలేదు.
Final Verdict :-
హార్దిక్ మెహతా డి కపుల్డ్ పేరుతో చేసిన ది బెస్ట్ సీరీస్. ఇది అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది. మెయిన్ లీడ్ మాధవన్, సుర్విన్ తమ పాత్రల్లో జీవించారు.
ప్రొడక్షన్ వాల్యూస్ బాగా ఉన్నాయి మరియు సినిమాటోగ్రఫీ విజువల్స్ చాలా బాగున్నాయి. మాధవన్ మరియు సువ్రిన్ నటన కోసం చూడచ్చు .
Rating : 3/5