Blood Money Movie Review and Rating |హిట్టా ఫట్టా :-


Movie : Blood Money (2021) Review
నటీనటులు :- ప్రియా భవానీ శంకర్, మెట్రో శిరీష్, కిషోర్ మొదలగు
నిర్మాత : ఇర్ఫాన్
సంగీత దర్శకుడు : సతీష్ రఘునాథన్
దర్శకుడు : సర్జున్ కె.ఎమ్.
Story :
ఈ కథ ఒక ప్రముఖ ఛానెల్‌లో సబ్-ఎడిటర్‌గా చేరిన రేచల్ విక్టర్ (ప్రియా భవానీ శంకర్) పరిచయంతో ప్రారంభమవుతుంది. ఒక్క స్త్రీ మరణంతో ముడిపడి ఉన్న ఇద్దరు తమిళ మనుషులకు మరణశిక్ష విధించిన సంఘటనను కొద్దిసేపటికే రేచల్ తెలుసుకుంటుంది.
అయినప్పటికీ, సోషల్ మీడియా ద్వారా ఆ ఇద్దరు తమిళ మనుషుల తల్లి భావోద్వేగానికి గురయ్యి మాట్లాడుతూ ఉన్న వీడియోను చూసినప్పుడు రేచల్ ఈ కేసుతో వ్యవహరించడం మొదలు పెడుతుంది. ఇక్కడ నుండి అసలు కథ మొదలవుతుంది, నిదానంగా కేస్ కి సంబందించిన వివరాలు సేకరించడం , ఆ స్త్రీ చావుకి నిజంగా ఈ ఇద్దరు మనుషులేనా అని తెలుసుకోవడానికి శ్రీలంక కి కూడా పోతుంది.
హత్యకు గురైన మహిళ ఎలా చనిపోయింది ? ఇద్దరు తమిళ మనుషులకు ఈ మహిళ మరణంతో సంబంధం ఉందా? రేచల్ విషయాలను ఎలా క్రమబద్ధీకరిస్తుంది? చివర్లో ఏం జరిగిందనేది మిగిలిన కథ.
Thumps Up :-
- ఈ తరహా థ్రిల్లర్ సినిమాని ఎంగేజ్ చేయడానికి ప్రియా భవానీ శంకర్ తన బాగా కష్టపడింది. కిషోర్‌తో పాటు మెట్రో శిరీష్ కూడా బాగా చేసారు.
- దర్శకుడు సర్జున్ కథ ఎంపిక బాగుంది.
- సినిమాటోగ్రఫీ మరియు నిర్మాణ విలువలు బాగున్నాయి.
- ముఖ్యంగా క్లైమాక్స్ పార్ట్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.
Thumps Down :-
- ట్విస్ట్ లు పెద్దగా ఆకట్టుకోవు.
- కొంచెం ల్యాగ్.
- శ్రీలంక ఎపిసోడ్
Final Verdict :-
ఓవరాల్‌గా బ్లడ్ మనీ అనేది దర్శకుడు సర్జున్ నుండి వచ్చిన మరొక విభిన్న చిత్రం, ఇది ఒక సినిమాకి కావాల్సిన మరియు అవసరమైన అంశాలతో నిండి ఉంది. కాకపోతే అతని ఫ్లాట్ డైరెక్షన్ ద్వారా ఎక్కువ శాతం అలరించదు. ప్రియా భవానీ శంకర్, మెట్రో శిరీష్ మరియు కిషోర్ ఈ థ్రిల్లర్‌ను ఎంగేజ్ చేయడంలో తమ వంతు కృషి చేశారు.
నిర్మాణ విలువలు, సినిమాటోగ్రఫీ బాగున్నాయి. క్లైమాక్స్ పోర్షన్‌లో సినిమాను హైలైట్ చేసిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. కొంచెం ల్యాగ్ మరియు ఎక్కువ ట్విస్ట్ లు ఊహించుకోకుండా చూస్తే ఈ సినిమా బాగుంటుంది.
Rating :- 2.75/5