83 (2021) Movie Review and Rating | హిట్టా ఫట్టా :-


Movie : 83 (2021) Review
నటీనటులు : రణవీర్ సింగ్, దీపికా పడుకొనే, పంకజ్ త్రిపాఠి, తాహిర్ రాజ్ భాసిన్, జీవా, సాకిబ్ సలీమ్, జతిన్ సర్నా, చిరాగ్ పాటిల్, దినకర్ శర్మ, నిశాంత్ దహియా, హార్డీ సంధు, సాహిల్ ఖట్టర్, అమ్మీ విర్క్, ఆదినాథ్ కొఠారే, ధైర్య కర్వా , బద్రీ మొదలగు
నిర్మాతలు :- దీపికా పడుకొనే,
కబీర్ ఖాన్, విష్ణువర్ధన్ ఇందూరి, సాజిద్ నడియాద్వాలా
సంగీత దర్శకుడు:- జూలియస్ ప్యాకియం, ప్రీతమ్
దర్శకుడు :- కబీర్ ఖాన్
Story :
ఈ కథ 1983 లో టీమ్ ఇండియాకు నాయకత్వం వహించిన కపిల్ దేవ్ (రణవీర్ సింగ్) పాత్ర చుట్టూ తిరుగుతుంది. ఆ సమయంలో ఇండియా కి వరల్డ్ కప్ వస్తుందన్న ఆశ భారతదేశంలో ఎవరికీ లేదు. కపిల్ జట్టు అనర్హులు మరియు ఏమి సాధించలేరు అని భావించిన భారతీయులే టీమ్ ఇండియా జట్టును నిరాశపరచడం ప్రారంభించారు! కపిల్ టీమ్ దీన్ని సవాలుగా తీసుకుని, ఫస్ట్ వరల్డ్ కప్ ఎలా సాధించారు. దాని వెనకాల కపిల్ టీమ్ పడిన కష్టం ఏంటి అనేదే ఈ సినిమా.
కపిల్ దేవ్ టీమ్ ను ఎలా నడిపించాడు? వరల్డ్ కప్ గెలవడానికి టీమ్ ఇండియా ఎదుర్కొన్న అడ్డంకులు ఏమిటి అనేది 83 స్టోరీ.
Thumps Up :-
- రణవీర్ సింగ్ కపిల్ దేవ్ పాత్రలో జీవించి అద్భుతంగా నటించాడు. కిర్ష్ శ్రీకాంత్ పాత్రలో అద్భుతంగా నటించిన జీవా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కపిల్ దేవ్ భార్య పాత్రలో దీపికా పడుకొనే కూడా బాగా చేసింది.
- దర్శకుడు కబీర్ ఖాన్ అద్భుతంగా పని చేసాడు మరియు గతంలో జరిగిన దృశ్యాలను తిరిగి సృష్టించాడు.
- సెకండ్ హాఫ్ లోని క్రికెట్ మ్యాచ్‌లు ఎప్పటిలాగే ఉండేలా రి-క్రియేట్ చేయడంలో VFX టీమ్ వర్క్ కనిపిస్తుంది.
- సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు బాగున్నాయి.
Thumps Down :-
- సినిమా యొక్క నిడివి.
Final Verdict :-
చివరగా, 83 అనే సినిమా ఇండియా మొదటి వరల్డ్ కప్‌ను గెలుచుకోవడానికి గతంలో జరిగిన దృశ్యాలను పునఃసృష్టించే ఒక అద్భుతమైన క్రికెట్ చిత్రం. కపిల్‌దేవ్‌గా రణవీర్‌సింగ్ ఆ పాత్రలో జీవించి, పాత్రకు న్యాయం చేశాడు. మిగిలిన వారందరూ అద్భుతమైన పని చేసారు.
దర్శకుడు కబీర్ ఖాన్ గతాన్ని రి-క్రియేట్ చేయడంలో అత్యుత్తమ పని చేసాడు మరియు ఈ కపిల్ దేవ్ జీవిత చరిత్రను ఉన్నది ఉన్నట్లుగా చుపియడంలో విజయం సాధించాడు. సినిమా సెకండాఫ్‌లోనీ క్రికెట్ మ్యాచేస్ కోసం Vfx బృందం చేసిన ప్రయత్నాలను కచ్చితంగా మెచ్చుకోవాలి. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు లావిష్‌గా ఉన్నాయి. ఒకేఒక నెగటివ్ ఏంటంటే సినిమా నిడివి మాత్రమే .
Rating :- 3.25/5